50 రోజులు దాటిపోయింది.. ఇంకా పాత చిత్రాలేనా?

by srinivas |
50 రోజులు దాటిపోయింది.. ఇంకా పాత చిత్రాలేనా?
X

దిశ, సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ప్రభుత్వ వాసనలు వదిలించుకుంటున్నారు. కానీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్, వైయస్సార్ ఫోటోలు ఇప్పటికీ అలాగే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం మారినా ఆ ఫొటోలు మార్చకపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story