యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి

by Mahesh |   ( Updated:2024-11-09 04:29:39.0  )
యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమైన మహిళా అఘోరి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి(Female Aghori) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీలోని శ్రీకాళహస్తి(Srikalahasti)కి చేరుకున్న ఆమె.. అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి.. ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అనంతరం విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి ఆమెకు ఫోన్ చేసి.. సర్దిచెప్పడంతో ఆమె తన శరీరంపై ఎర్రటి దుస్తులు దర్శనం చేసుకున్నారు. అనంతంర అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె ఉన్నట్టుండి.. యాగంటి క్షేత్రం(Yaganti Kshetra)లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కళ్యాణం(Welfare of the world) చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు. అలాగే ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని, సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కుంభమేళకు రావాలని తనకు ఆహ్వానం వచ్చిందని, మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ వస్తానని, ఒక్క రాష్ట్రంలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు. యాగంటి క్షేత్రంలో ఆమెకు స్వాగతం పలకగా.. దర్శనం చేసుకున్న అనంతరం మహిళా అఘోరి మహానందికి బయలు దేరారు.

Advertisement

Next Story

Most Viewed