- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తికోసం కొడుకును చంపాలని తండ్రి ప్లాన్!
దిశ, వెబ్‌డెస్క్: నంద్యాల జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతండ్రే కొడుకును చంపాలని ప్లాన్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాలలో నిరంజన్ అనే వ్యక్తి.. తన కొడుకు వినోద్‌ను కిడ్నాప్ చేయాలని కొందరు దుండగులకు సుపారీ ఇచ్చాడు. దీంతో ప్లాన్ ప్రకారం రెండు కార్లలో వచ్చిన దండగులు వినోద్‌ను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. చిత్రహింసలు పెట్టడమే కాకుండా.. వినోద్ మెడపై కత్తి పెట్టి బెదిరించి ఆస్తి పత్రాలపై కిడ్నాపర్లు సంతకం చేయించుకున్నాడు.
అనంతరం వారి చెర నుంచి తప్పించుకొని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు సరిగా రెస్పాండ్ కాకపోవడంతో ఎస్పీని కలిశాడు. దీంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వినోద్ తండ్రి నిరంజన్ పరారీలో ఉన్నాడు. కాగా, కాగా, కొద్ది రోజుల క్రితం వినోద్ కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. అది నచ్చకే తండ్రి కుమారుడి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.