ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం

by Seetharam |   ( Updated:2023-12-26 08:12:50.0  )
ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జగ్గంపేట ఎస్ఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన కోన సత్తిబాబు, రాయవరం మండలం అత్తమూరు గ్రామానికి చెందిన కర్రి రాజకుమర్ రెడ్డిలు బైక్‌పై వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను వీరు ఢీకొట్టారు. దీంతో కోన సత్తిబాబు, కర్రి రాజకుమార్ రెడ్డిలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ నాగార్జున వెల్లడించారు.

Advertisement

Next Story