Breaking: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ విద్యార్థుల మృతి

by srinivas |
Breaking: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ విద్యార్థుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా రామంజేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కును ఎదురుగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. అయితే వీరంతా చెన్నై లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. ఒంగోలు నుంచి తిరువళ్లూరుకు విద్యార్థులు వెళ్తుండగా చెన్నైకు 65 కిలో మీటర్ల దూరంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు నితీశ్ వర్మ, చేతన్ , యుగేశ్, నితీశ్, రామ్మోహన్ రెడ్డిగా క్షతగాత్రులు చైతన్య, విష్ణుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story