- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతు సంక్షేమమే మా లక్ష్యం: మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గన్నవరం నియోజవర్గంలోడా.వైఎస్ఆర్ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాతో కలిసి ఈ శిక్షణా కేంద్రం శంకుస్థాపన చేశారు. ఈ విత్తన పరిశోధన కేంద్రం, శిక్షణ కేంద్రం వల్ల రైతాంగానికి ఎంతోమేలు జరుగుతుందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుపక్షపాతి ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతును రాజుగా చూడాలనే తపనతో అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ సంస్థ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. విత్తన పరిశోధన వల్ల కల్తీకి అడ్డుకట్ట వేసి నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి అందించ వచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్రివేది ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు