నాపై తప్పుడు రాతలు....లీగల్‌గా పోటీ చేస్తా: మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

by Seetharam |   ( Updated:2023-08-22 10:36:19.0  )
నాపై తప్పుడు రాతలు....లీగల్‌గా పోటీ చేస్తా: మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన తన భార్య ఆస్థులు తనపేరుపై మార్పించుకునేందుకు లంచం ఇచ్చినట్లు ఓ మీడియాలో కథనాలు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. మ్యుటేషన్ కోసం ఓ వెయ్యి రూపాయల ఫీజు చెల్లించా. దానిని వైఎస్ జగన్‌కు చెందిన దినపత్రికలో వికృత రాతలు రాశారు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి ఎమ్మెల్యే నా శిష్యుడు అని చెప్పినందుకు తనకే సిగ్గేస్తుందని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను వైసీపీ నాయకుల మాదిరి బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. తన జోలికి వస్తే వైసీపీ నాయుకులు భస్మం అయిపోతారని హెచ్చరించారు. తనపై రాసిన వికృత రాతలపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. దమ్ము ఉంటే తన మీద దర్యాప్తు చేయాలని ఛాలెంజ్ చేశారు. వైఎస్ జగన్‌కు చెందిన పత్రిక క్షమాపణ చెప్పకపోతే లీగల్ ఫైట్ చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story