'కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్' పేరుతో ఫేక్ క్లిప్పింగ్.. ఖండించిన దిశ యాజమాన్యం

by Prasad Jukanti |   ( Updated:2024-05-01 13:11:32.0  )
కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్  పేరుతో ఫేక్ క్లిప్పింగ్.. ఖండించిన దిశ యాజమాన్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో:దిశ పేరుతో మరోసారి మార్ఫింగ్ న్యూస్ క్లిప్పింగ్ కలకలం రేపుతున్నది. ప్రజల్లో ‘దిశ’కు ఉన్న ప్రజాదరణ, ప్రచురించే వార్తలకు ఉన్న విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ శక్తులు తప్పుడు క్లిప్పింగ్‌ను తమకు అనుకూలంగా సృష్టించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నాయి. తాజాగా బుధవారం 2 పీఎం ఏపీ డైనమిక్ లో 'సోషల్ మీడియా రాణులకు కొత్త కష్టాలు' అనే శీర్షికతో దిశ ఒక కథనాన్ని వెలువరించింది. అయితే ఈ కథనాన్ని మార్ఫింగ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాని స్థానంలో 'కన్నడ సెక్స్ స్కామ్ నారా లోకేశ్' అంటూ ఫేక్ క్లిప్పింగ్ ను సృష్టించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కన్నడ జేడీఎస్ బహిష్కృత నేత ప్రజ్వల్ సెక్స్ స్కామ్ ఇష్యూపై రచ్చ జరుగుతోంది. ఇదే అదునుగా భావించారో ఏమో కానీ 'కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్​ఉన్నారని, ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవన్నతో లోకేశ్ కు సత్సంబంధాలు ఉన్నాయని, కర్ణాటకలో వందల మంది అమ్మాయిలతో ఇరువురు రాసలీలు జరిపారని, పెన్ డ్రైవ్ వీడియో ఫుటేజీల్లో లోకేశ్ నీలి చిత్రాలు బట్టబయలు అయ్యాయి' అంటూ దిశలో కథనం వెలువడినట్లుగా ఫేక్ క్లిప్పింగ్ సృష్టించి ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ క్లిప్పింగ్ ను దిశ యాజమాన్యం ఖండించింది. 'కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్' అనే కథనానికి దిశకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు వాటి అభిప్రాయాలను ప్రజల్లోకి సూటిగా తీసుకెళ్ళడానికి బదులుగా గందరగోళంలోకి నెట్టేందుకు ఇలాంటి ఎత్తుగడలను వాడుకోవడం దురదృష్టకరం అని దిశ పేరుతో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని యాజమాన్యం పాఠకులకు సూచించింది. ఫేక్ క్లిప్పింగ్ లను సృష్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read More..

AP News:చిరంజీవినే అవమానిస్తారా..? సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్..!

Advertisement

Next Story