అమరావతిలో తీవ్ర ఉద్రిక్తం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్ట్

by Prasanna |
అమరావతిలో తీవ్ర ఉద్రిక్తం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతి అమరలింగేశ్వర ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.ఇకపోతే గుంటూరు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు , నియోజకవర్గ అభివృద్దిపై అమరావతి అమరేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసిన సవాల్‌ను ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వీకరించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆదివారం చర్చకు సిద్ధంగా ఉండాలని అందుకు అమరేశ్వరస్వామి ఆలయంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ చర్చ లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే శంకర్ రావు అమరేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అయితే చర్చకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అమరేశ్వరస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌తోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీస్ వ్యాన్‌పై రాళ్లు రువ్వారు. అయితే రాళ్లు టీడీపీ నేతల వైపు నుంచి రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.

క్రోసూరు పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రమాణం చేసేందుకు శాంతియుతంగా వెళ్తుంటే తమను అడ్డుకోవడం సరికాదన్నారు. చర్చకు రమ్మని పిలిచిన ఎమ్మెల్యే నంబూరి శంకరరావు పోలీసులుతో తమను అడ్డగించారిన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను అరెస్ట్ చేసే సమ యంలో ఆయన చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. అయినప్పటికీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి క్రోసూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed