ఉత్కంఠతభరితంగా తు.గో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక.. ఆ 5 స్థానాలు ఎవరికీ..?

by Indraja |
ఉత్కంఠతభరితంగా తు.గో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక.. ఆ 5 స్థానాలు ఎవరికీ..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంద్రప్రదేశ్ లో పొత్తు ల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తో జనసేన పార్టీ పొత్తు కలుపుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ పార్టీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. సాధారణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్ని ప్రధాన పార్టీలకు ఎంతో కీలకమైంది. అందుకే వైసీపీ ఇప్పటికే ఇక్కడ నుండి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఓ వైపు కొన్ని స్థానాల్లో రెండు పార్టీల అభ్యర్థులు ప్రభావం చూపుతుండగా.. మరో వైపు టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలను జనసేన కోరుతోంది.

ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. దీనితో ఇక చేసేదేమిలేక ఇరు పార్టీల అధినేతలు రీ సర్వేకి సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో ఏ స్థానాలలో ఏ పార్టీకి ఆధిక్యత ఉంది.. ఎవరికీ ఏ స్థానాలు దక్కనున్నాయనే ఉత్కంఠత అటు నేతల్లోనూ.. ఇటు పార్టీ అభిమానుల్లోనూ నెలకొంది. కాగా జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే 5 స్థానాల్లో అటు టీడీపీ అభ్యర్థులు, ఇటు జనసేన అభ్యర్థులు పోటా పోటీగా ఉన్నారు. రాజమండ్రి రూరల్‌, కాకినాడ రూరల్‌, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల నుండి ఏ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారా అనే ప్రశ్న ఉత్కంఠత రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story