- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kethireddy : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి రెవెన్యూ అధికారుల షాక్
దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethi Reddy Venkatrami Reddy) కి భూ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. చెరువు భూములు కబ్జా విషయమై కేతిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణా రెడ్డి భార్య వసుమతికి నోటీసు(Notices)లు జారీ చేశారు. ఈనెల 6న కేతిరెడ్డి పీఏ నోటీసులు అందుకున్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హిమాలయాల పర్యటనలో ఉన్నారు. ఆక్రమించిన చెరువు భూములను 7రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే భూములను తామే స్వాధీనం చేసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 5న నోటిసులు జారీ చేసినట్లుగా ధర్మవరం నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. కేతిరెడ్డి కుటుంబం మొత్తం మొత్తం 20.61 ఎకరాల చెరువు భూముల కబ్జాకు పాల్పడ్డారంటూ రెవెన్యూ శాఖ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను వెలికితీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చెరువు భూములను ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వచ్చాయి. ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీసి విచారణ చేపట్టారు. ఈ చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. చెరువును ఆక్రమించి గుర్రాల కోట నిర్మించి, తోట సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు విషయాన్ని కూడా తహశీల్దార్ నోటీసులో చెప్పుకొచ్చారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ధర్మవరం ప్రజలు, చెరువు ఆయకట్టు రైతులకు నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరనుందని స్థానికులు చెబుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి
చెరువు ఆక్రమించారంటూ తనపైన, కుటుంబ సభ్యులపైన వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అసలు అక్కడ ఇరిగేషన్ శాఖ భూములు లేవని కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. రెవెన్యూ అధికారుల నోటీసులపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారని, తన పరువుకు భంగం కల్గించిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు.