TTD:టీటీడీలో వంద కోట్ల అవినీతి..కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-18 09:08:51.0  )
TTD:టీటీడీలో వంద కోట్ల అవినీతి..కేంద్ర మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తుంది. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని కూటమి అధికారులు గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీటీడీలో వైసీపీ పాలనలో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులు శ్రీవారి హుండీలో వేసిన సొమ్మును అపవిత్రం చేశారని మండిపడ్డారు. టీటీడీ సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని వాపోయారు. 6 నెలల కిందట టీటీడీలో రూ.100 కోట్లు చేతులు మారాయని చింతా మోహన్ చెప్పారు. సత్రాల నిర్మాణం కోసం రూ.1200 కోట్లతో ప్రైవేటు సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని గుర్తుచేశారు. అంతేకాదు తిరుపతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. వరుస ఘటనలు, కాంట్రాక్ట్ విషయంలో వస్తున్న ఆరోపణలపై టీటీడీ ఈవో విచారణ జరిపించాలని చింతా మోహన్ డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed