- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మహిళలపై వరుస లైంగికదాడి(sexual assault) ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ మంత్రి రోజా(Former minister Roja) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి రోజా(Former minister Roja) ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న ఈ వరుస ఘటనలపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి జరిగిన ఘటన అమానవీయం అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎక్కడికి పోయారంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు. హోంమంత్రి అనిత(Home Minister Anitha) సరిగ్గా పని చేయలేదని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడటం వెనుక కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు. పిఠాపురంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కనీసం పలకరించలేదని ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే మంత్రి నారా లోకేష్ విదేశాల్లో తిరుగుతున్నారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.