నయ వంచనకు ప్రతిరూపం చంద్రబాబు: పేర్ని నాని

by GSrikanth |
నయ వంచనకు ప్రతిరూపం చంద్రబాబు: పేర్ని నాని
X

దిశ, వెబ్‌డెస్క్: బూటకపు మాటలు, నయ వంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుటిల వాగ్ధానాలకు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేస్తామని ప్రకటించిన ఆయన.. ప్రజల్లో తిరుగుబాటును చూసి యూటర్న్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గాలానికి వాలంటీర్లు పడబోరు అని చెప్పారు. కాగా, ఉగాది సందర్భంగా వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. వారినే కొనసాగిస్తామని తెలిపారు. అంతేకాదు.. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story