- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:‘ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి’
దిశ ప్రతినిధి,కర్నూలు:ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కర్నూలు ఎంపీ బస్తీ పాటి నాగరాజు సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి అవుట్ డోర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేసారని, అలాంటి వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.
దేశ సార్వభౌమాధికారాన్ని అందరూ కాపాడాలన్న ఆయన..హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బి వై రామయ్య, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, సెట్కూర్ సీఈవో రమణ, జిల్లా టూరిజం అధికారి విజయ, ఎస్‌డీఓ భూపతి రావు, నగరంలోని వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర, విద్యార్థులు పాల్గొన్నారు.