అందరికీ తెలిసిందేగా‘రసికులం’: మంత్రి అంబటిపై అయ్యన్న సెటైర్లు

by Seetharam |
అందరికీ తెలిసిందేగా‘రసికులం’: మంత్రి అంబటిపై అయ్యన్న సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని ఆరోపిస్తూ టీడీపీ పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ‘కళ్లు తెరిపిద్దాం’ పేరుతో టీడీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ అంశంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుతున్నాయి.‘ఇన్నాళ్లూ ప్రజలకళ్ళకి గంతలు కట్టారు. ఇప్పుడు మీరే కట్టుకుంటున్నారు. విధి.....విధి......... విచిత్రమైనది !’ అంటూ మంత్రి అంబటి రాంబాబు కళ్లు తెరిపిద్దాం కార్యక్రమంపై సెటైర్లు వేశారు.‘అధికార మదంతో వచ్చిన అహంకారం అనే గంతలతో మీకు నిజం తెలియడం లేదు. మీరు కళ్ళు తెరిచి చూసేసరికి మీ చీటీ చినిగిపోతుంది... మీ సినిమా ముగిసిపోయింది. విధి చిద్విలాసం అంటే అప్పుడు తెలుస్తుంది’ అంటూ మంత్రి అంబటి రాంబాబుకు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపైనా ట్విటర్ వేదికగా వాగ్వాదం జరిగింది.‘కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి !’ అంటూ మంత్రి అంబటి రాంబాబు అన్న వ్యాఖ్యలకు అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.‘అందరికీ తెలిసిందేగా ‘రసికులం’’ అంటూ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed