మైలవరం టీడీపీలో మరో ట్విస్ట్!.. స్థానికుడైనా నాకే టికెట్ దక్కాలి

by Ramesh Goud |   ( Updated:2024-03-04 11:08:44.0  )
మైలవరం టీడీపీలో మరో ట్విస్ట్!.. స్థానికుడైనా నాకే టికెట్ దక్కాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవినేని ఉమతో కలిసి వెళ్లేది లేదని, మైలవరం టికెట్ ముగ్గురం ఆశిస్తున్నామని, స్థానికుడినైన తనకే సీటు దక్కుతుందని మైలవరం టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు అన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత ఆయన వ్యతిరేఖ వర్గం దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఒకటయ్యారని, వీరిద్దరు కలిసి శంఖారావం కార్యక్రమం నిర్వహించబోతున్నారని విస్తృతంగా వార్తలు వచ్చాయి.

దీనిపై బొమ్మసాని సుబ్బారావు స్పందిస్తూ.. వసంతకు వ్యతిరేఖంగా దేవినేని ఉమాతో కలిసిన మాట అవాస్తవమని చెప్పారు. మైలవరం సీటు కోసం ముగ్గురం ప్రయత్నిస్తున్నామని, నిన్న యాదృచ్ఛికంగా ఉమాని కలవడం జరిగిందని, ఆయనతో కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. మైలవరంలో గత ఐదు పర్యాయాల నుంచి ఇతర ప్రాంతాల వారే ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంటున్నారని, స్థానికంగా తాను కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉంటూ.. నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని, ఈ ప్రాంతంలోని పేద వర్గాల నుంచి తనకి ఎంతో ఆధరన ఉందని తెలిపారు. అందుకే వారితో పాటు తాను కూడా టికెట్ ఆశిస్తున్నానని, స్థానికుడినైన నాకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాక టికెట్ వేరే వారికి కేటాయించినా కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం పని చేస్తానని అన్నారు.

Read More..

ఒక సీటు.. ముగ్గురు పోటీ.. పెనమలూరు టీడీపీలో మూడు ముక్కలాట

Advertisement

Next Story

Most Viewed