- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ డేటాకు భద్రత కల్పించండి: సీఎం వైఎస్ జగన్‌కు సీపీఎం లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : ‘జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ సందర్భంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అవసరమైన మందులు సరఫరా చేయాలి. వైద్యుల్ని, సిబ్బందిని సమకూర్చాలి. ప్రభుత్వ వైద్యశాలల్ని ఆధునీకరించి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించాలి. లేకుంటే ఈ కార్యక్రమం ప్రచారార్భాటంగా మిగిలిపోతుంది’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ‘ప్రజల నుండి సేకరించే డేటాకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వం సేకరించిన డేటా ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల చేతికి పోయిన విషయం బహిరంగ రహస్యమే. పౌరుల ప్రైవసీ దెబ్బ తినడమే కాకుండా డేటాను అమ్ముకుని కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆరోగ్య డేటాకు పూర్తి భద్రత కల్పించాలి’ అని వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆరోగ్యసేతుకు అనుసంధానం చేస్తున్నారు. అది అక్కడ నుండి ప్రైవేటు ఇన్సూరెన్సు, ఫార్మా కంపెనీలకు చేరే ప్రమాదం ఉన్నది. కేంద్రం నుండి డేటా భద్రతకు హామీ లేకుండా ఈ సమాచారాన్ని అనుసంధానం చేయకూడదు. రాష్ట్రంలో కూడా ఈ సమాచారం బయట వ్యక్తులకు, ప్రైవేటు కంపెనీలకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అందుకోసం డేటా భద్రత చట్టాన్ని తీసుకురావాలి అని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌కు వి.శ్రీనివాసరావు లేఖ రాశారు.