2024లో వైసీపీ అంతం.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయం: బుద్దా వెంకన్న

by Seetharam |
2024లో వైసీపీ అంతం.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయం: బుద్దా వెంకన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో వైసీపీ బీఫామ్‌పై పోటీ చేసే వారు ఓడిపోతారని....టీడీపీ-జనసేన బీఫామ్‌పై పోటీ చేసే వాళ్లు గెలవడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, హ్యాపీగా వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. టికెట్స్ లేవంటే వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం విజయవాడలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తోనే వైఎస్ జగన్ పతనం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే ఇక మిగిలుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 2023 జగన్ విధ్వంస నామ సంవత్సరంగా మిగిలిపోతుందని ధ్వజమెత్తారు. 2024లో రాక్షస పాలన అంతరిస్తుందని, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారంటూ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు నాయుడే సరైన న్యాయం చేస్తారని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన మంత్రి బొత్స సత్యనారాయణ నేడు జగన్ ముందు ఎలా ఉన్నారో చూస్తే బలహీన వర్గాల పరిస్థితి ఎలా వుందో అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు. మంత్రి బొత్సతో మైకులు లేకుండా మాట్లాడితే ఆయన మొత్తం చెపుతారని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story