ఫేక్ సర్టికెట్లతో ఉద్యోగం: ఇద్దరిపై కేసు నమోదు

by Seetharam |
ఫేక్ సర్టికెట్లతో ఉద్యోగం: ఇద్దరిపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు కేటుగాళ్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లతో వైద్య ఆరోగ్యశాఖలో ఇద్దరు ఉద్యోగులు చేరారు. ఆడియో మెట్రిక్ టెక్నీషియన్లపై ఏలూరు టూ టౌన్ పోలీస్‌లు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు వైద్య కళాశాలలో 2022 ఆగస్టులో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జీవో నోటిఫికేషన్ వచ్చింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారు. ఈ విషయం కొందరు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడంతో.. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు ఆదేశించారు. దీనిపై ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించి విచారణకు ఆదేశించారు. చీమల వీర నరేష్, రామేశ్వరపు మిత్రనంద ఫేక్ సర్టిఫికెట్ ద్వారా ఉద్యోగాలు పొంది తాడేపల్లిగూడెం, చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఉద్యోగాల విషయంలో తెర వెనుక ఓ మహిళా ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల ఉద్యోగాల బాగోతంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరుల పాత్రపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story