- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూటమి ప్రభుత్వంతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు:టీడీపీ ఎంపీ అభ్యర్థి
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పన కూటమి ప్రభుత్వం ఏర్పాటు తోనే సాధ్యమని , తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. వెంకోజిపాలెం సి,ఎం,ఆర్ ఫంక్షన్ హాల్లో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి షాపింగ్ మాల్స్‌లో పనిచేసే ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలన వల్ల విశాఖలో అన్ని వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం లూలు మాల్ ద్వారా 5 వేల మంది స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కృషి చేసామని చెప్పింది. కానీ వైసీపీ ప్రభుత్వం దానిని కూడా వెళ్లగోట్టిందన్నారు.
దీంతో స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వివరించారు. ప్రతి సంవత్సరం ఉన్నత విద్య పూర్తి చేసి 3 లక్షల మంది విద్యార్థులు వస్తుండగా గత 5 సంవత్సరాలుగా అవకాశాలు లేక కొందరు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతుంటే మరికొందరు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క విశాఖ జిల్లాలో దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖ ప్రశాంత వాతావరణం దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహారించింది అన్నారు. దోపిడీలు హత్యలు రౌడీయిజం పెరిగిందన్నారు. తన మీద పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి కుటుంబం సైతం కిడ్నాప్ గురైతే రెండు రోజులకు కూడా గుర్తించ లేకపోయారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.ఆర్ మాల్స్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత కంకటాల మల్లిక్‌తో పాటు పలువురు వ్యాపారాలు, ఉద్యోగులు పాల్గొన్నారు.