ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం అమానుషం.. సంచలన విషయాలు బయట పెట్టిన సూర్యనారాయణ

by srinivas |   ( Updated:2024-06-23 12:39:42.0  )
ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం అమానుషం..   సంచలన విషయాలు బయట పెట్టిన సూర్యనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల పీఆర్సీతో పాటు పలు హామీలను సైతం నెరవేర్చాతానని మాట ఇచ్చారు. అయితే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత ఉద్యోగుల సమస్యలను విస్మరించారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య వేదక చైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ సమస్యలపై పోరాటం చేశారు. అయితే ఆయనను ప్రభుత్వం వేధించింది. సూర్య నారాయణపై కేసులు పెట్టడంతో ఆయన కుటుంబాన్ని సైతం విచారణ పేరుతో వేధించింది. అయితే అదంతా అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేయించారని సూర్య నారాయణ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు అధికారులను అడ్డుపెట్టుకుని తనను వేధించారని సూర్యనారాయణ కోర్టుకు సైతం వెళ్లారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించిన తనపై గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తాజాగా సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడుతూగత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేధింపులపై కీలక విషయాలు వివరించారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అణిచి వేయాలని చూసిందని, ఏ కేసు అనే విసయాన్ని చెప్పకుండా తనను విచారణకు పిలిచేవారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్‌లు దిగజారిపోయి ప్రవర్తించారని ఆరోపించారు. విచారణ పేరుతో తన ఫ్యామిలీ సైతం వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సమయంలో తన భార్య మెడలో ఉన్న నల్లపూసల గొలుసును కూడా తీయించారని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను కాపాలాపెట్టారని తెలిపారు. తన ఫ్యామిలీని వేధించిన అధికారులు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ దినపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా తనపై చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వం సిద్ధపడిందని కె.ఆర్. సూర్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed