Breaking: ఏపీ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2024-08-19 05:21:12.0  )
Breaking: ఏపీ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యోగుల బదిలీలు షురూ అయ్యాయి. విద్య, వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తున్నారు. అయితే ఉద్యోగుల బదిలీల్లో పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండకూడదని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలపై మార్గరద్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 లోపు ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

Next Story