రేపే ఎన్నికల నోటిఫికేషన్.. సీఈవో కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-04-17 15:41:52.0  )
రేపే ఎన్నికల నోటిఫికేషన్.. సీఈవో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. అలాగే నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఈ నెల 26న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీతో గడువు ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా కీలక సమాచారాన్ని తెలియజేశారు. ఎంపీ అభ్యర్థులు కలెకట్లరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు వేయాలని చెప్పారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థితో సహా నలుగురికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. సువిధ యాప్ ద్వారా నామినేషన్ వేసిన కాపీలను ప్రత్యక్షంగా సమర్పించాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

Advertisement

Next Story