- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల ఎఫెక్ట్.. రూ 10 కే మద్యం, 50 నోటుకి బియ్యం బస్తా
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉత్కంఠభరితంగా ప్రచారం జరుగుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఒక వైపు అధికార వైసీపీ మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా నేటితో ఎన్నికల ప్రచార సమయం ముగియనుండటంతో.. తదుపరి ఘట్టం ప్రలోభాలకు గురి చేయడం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేతలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా కేవలం నగదు పంపిణీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. నేతలు కొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే మందుబాబులకు రూ. 10 నోటు, మహిళలకు రూ. 50 నోట్లను టోకెన్లుగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నోట్లకు తీసుకుని వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లి ఇస్తే.. మందుబాబులకు మద్యం బాటిల్, మహిళలకు బియ్యం బస్తాలు ఇచ్చేందుకు నేతలు స్కెచ్ వేశారు. అయితే ఈ సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చెపట్టింది. ఈ క్రమంలోనే.. ఓ గోదాములో 3 లారీల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Read More..
రాష్ట్రంలో పోలింగ్ టైమింగ్స్ విడుదల.. ఆ ప్రాంతాల్లో అనూహ్య మార్పులు