ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా..

by Anjali |
ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ పరీక్ష వాయిదా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మే 20 న జరగాల్సిన ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను రాష్ట్ర ఉన్నత మండలి వాయిదా వేసింది. తిరిగి ఈ పరీక్షను జూన్ మూడో వారంలో నిర్వహించనునున్నట్లు తెలిపింది. కాగా.. ఆప్లికేషన్ గడువు కూడా ఏప్రిల్ 23వ తేదీన ముగియనుండగా, ఎలాంటి ఫైన్ లేకుండా మే 15 వరకు పెంచింది. ఉపాధ్యాయ రంగంలో రాణించాలనే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ డేట్‌లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ హాల్ టికెట్లు జూన్ 2వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story