- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో పోలింగ్ టైమింగ్స్ విడుదల.. ఆ ప్రాంతాల్లో అనూహ్య మార్పులు
దిశ, వెబ్‌డెస్క్: దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేడు ముగింపు పలికింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారాలు ముగియనున్నాయి. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసింది. ఏపీలో 6 నియోజక వర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. కాగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుందని ఈసీ వెల్లడించింది. పాలకొండ, కురుపాలం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుందని తెలిపింది. ఓటింగ్ సమయం ముగిసినప్పటికీ ఆ సమయంలోగా క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఈసీ పేర్కొంది.