- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రావులపాలెంలో చిరుత పులి కలకలం.. గోదావరి బ్రిడ్జి సమీపంలో సంచారం
దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పులి కలకలం రేగింది. గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో సంచరిస్తోంది. పులిని చూసిన మత్య్సకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి పాదముద్రలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పులేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కను చూసి మత్య్సకారులు పులి అని చెబుతున్నారని భావిస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో రాజమండ్రి శివారు ప్రాంతం కడియం, బుర్రిలంకలో పులి కనిపించింది. దీంతో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతలో బోనులు, ఉచ్చులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ పులి అచూకీ తెలియలేదు. నాలుగు రోజులుగా ఫారెస్ట్ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. ఇదే క్రమంలో చిరుత లంకలోకి వెళ్లిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కానీ రావులపాలెం వరకూ చిరుత పులి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చిరుత పులి అక్కడికి వెళ్లలేదని చెబుతున్నారు. మత్య్సకారులు చూసింది పులేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులి కోసం గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో గాలిస్తున్నారు.