Mahanadu2023: అవి ఎవరివో చెప్పలగలవా.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

by srinivas |   ( Updated:2023-05-27 07:10:33.0  )
Mahanadu2023: అవి ఎవరివో చెప్పలగలవా.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి పేదవాడని చెప్పుకుంటున్నారని ఎవరు పేదవాళ్లో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్ దోపిడీ దారుడని.. ఆయన రూ.510 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

2004లో ఇల్లు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని నిలదీశారు. ఏడు బంగళాలున్న జగన్ పేదవాడా?. ఇడుపలపాయ, పులివెందుల, లోటస్ పాండ్, అమరావతి, చెన్నై, బెంగళూరు ప్యాలెసులు ఎవరివని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ముప్పై కేజీల మనిషికి ఆరు కొంపలు సరిపోనట్టుగా విశాఖలో కూడా ఇంకో ఇల్లు కడతాడటని సెటైర్స్ వేశారు. జగన్ ఉత్తరాంధ్రను ఉద్దరిస్తాడట అని ఎద్దేవా చేశారు. ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టేందుకే ఉత్తరాంధ్రకు రాజధానిని ప్రకటించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more:

Tdp Mahanadu: రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం

Mp Avinash Reddy Bail: తగ్గేదేలేదంటున్న సీబీఐ.. మూడు అంశాలపై బలంగా వాదనలు

video courtesy of Telugu Desam Party Official YouTube Channel

Advertisement

Next Story

Most Viewed