- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుబాటులోకి ఇసుక.. త్వరలో ఆన్‌లైన్ ద్వారా పంపిణీ
దిశ, కోనసీమ ప్రతినిధి: ఇసుక కోసం ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం కానుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో కోనసీమ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక ఇస్తామనే హమీ మేరకు కొంత కాలం ఇసుక పంపిణీ చేసినా సరైన విధివిధానాలు లేవు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని త్వరలోనే ఉచిత ఇసుక కోసం సరైన విధివిధానాలు రూపొందిస్తామని హమీ ఇచ్చారు. దీంతో నాటి నుంచి ఇసుక నిలిపోయింది. అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులు కూడా నిలిపోయాయి.
నిలిచిన వేలాది నిర్మాణాలు
ఇసుక లేకపోవడంతో కోనసీమ జిల్లాలో వేలాది నిర్మాణాలు నిలిచిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు భవన నిర్మాణ కార్మికులకు పనులు కూడా లేకుండా పోయాయి. అంతేగాక ప్రభుత్వ భవనాలు కూడా నిలిచిపోయాయి.
ఇక నుంచి ఆన్‌లైన్‌లో..
ఇక నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం ఇసుక ఆన్‌లైన్ ద్వారా దొరకనుంది. అవసరం అయితే ఆఫ్‌లైన్ ద్వారా రీచ్ వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చును. ఇసుకకు ప్రత్యేక కమిటీ వేయనున్నారు. కమిటీ నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు. కేవలం సీనరేజీ , ట్రాన్స్‌పోర్టు చార్జీలు మాత్రమే తీసుకొంటారని అంటున్నారు. దీనివల్ల తక్కువ ధరకు ఇసుక వచ్చే అవకాశం ఉందని అనేక మంది అంటున్నారు.
పుంజుకోనున్న అభివృద్ధి పనులు
ఇసుక చౌకగా దొరకడం వల్ల అభివృద్ధి పనులు వేగంగా చేసుకోవచ్చని నామవానిపాలెం సర్పంచ్ భూపతి రాజు వెంకట పతి రాజు అన్నారు. గ్రామాల్లో ఇసుక లేక చాలా ఇబ్బందులు పడ్డామని, గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మరింత ఇబ్బందులు పడ్డామని అన్నారు. దీనికి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి అవకాశం వచ్చిందని అన్నారు.
వేగంగా ఇళ్ల నిర్మాణాలు
ఇసుక దొరకడం వల్ల ఇంటి నిర్మాణాలు వేగం పుంజుకొంటాయని జనసేన ఉపాధ్యక్షులు యాళ్ల వెంకటరమణ అన్నారు. భవన కార్మికులకు కూడా మంచి ఉపాధి లభిస్తుందని అన్నారు.