- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varahi Yatra: కాకినాడ ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్..
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ ఎమ్మెల్యే దగ్గరున్న ఓ గుండా తుపాకీతో బెదిరిస్తున్నాడట.. అక్కడికే వెళ్లి తేలుస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వారాహి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర నేలపై నిలబడి ఉంటానని.. ఏ గుండా వస్తారో రండి అని సవాల్ విసిరారు. వైసీపీ గూండాలను చొక్కాలు చించి కొడతానని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను ప్రజల కోసం పోరాడతానని.. ఎంతవరకైనా తెగిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఇక మంత్రి పెద్దిరెడ్డిని కూడా పవన్ కల్యాణ్ వదల్లేదు. ఇసుక కాంట్రాక్టుల్లో మంత్రి పెద్దిరెడ్డి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పిఠాపురంలో మూడు పంటల భూములు ఒకే పంటకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవిపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజల కోసమే వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీగా ఉన్నానని పవన్ వ్యాఖ్యానించారు. కులాన్ని చూసి కాదని.. సరైనోడా కాదా అని ఆలోచించుకుని ఓటు వేయాలని ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఒక్కసారి అధికారం ఇవ్వాలని, దత్తాత్రేయ సాక్షిగా అడుగుతున్నానని తెలిపారు. అధికారంలోకి వస్తే దేశంలోనే ఏపీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానన్నారు. గూండాలకు నరకం చూపిస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఏ వ్యూహానైనా అమలు చేస్తానని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.