Pawan Kalyan Fans రచ్చ రచ్చ..!

by srinivas |   ( Updated:2023-01-03 10:24:43.0  )
Pawan Kalyan Fans రచ్చ రచ్చ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగా ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే యూత్‌లో మరింత క్రేజ్. తమ అభిమాన నటుడు సినిమా విడుదలైనప్పుడు వారి చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆ హంగామా ఒక్కోసారి శృతిమించితే ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తోంది. ఇలాంటి ఘటనలు చాలాచోట్ల జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వెలుగులోకి వచ్చింది.

ఓ థియేటర్‌లో పవన్ కల్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.'ఖుషి' సినిమా ప్రదర్శనలో భాగంగా థియేటర్‌లోనే పేపర్లతో మంటలు వేసి అభిమానులు రచ్చరచ్చ చేశారు. జనవరి 1న జగ్గయ్యపేట జీ3కమల థియేటర్‌లో 'ఖుషి' సినిమా ప్రదర్శిస్తుండగా అభిమానులు కాగితాలు చింపి హంగామాచేశారు. వీరిలో మరికొందరయితే మరింత రెచ్చిపోయారు. చించేసిన పేపర్లన్నింటిని పోగు చేసి ఏకంగా థియేటర్‌లోనే మంటలు వేశారు. దీంతో థియేటర్ మేనేజర్ గోపి మంటను ఆర్పివేసేందుకు ప్రయత్నించగా అభిమానులు అతడితో గొడవకు దిగారు. అంతేకాదు చేయికూడా చేసుకున్నారని తెలుస్తోంది.

దీంతో మేనేజర్ గోపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం థియేటర్‌లో భోగిమంటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ అభిమానుల అత్యుత్సాహంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిల వల్ల పవన్ కల్యాణ్‌కు చెడ్డపేరు తీసుకువస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story