Pawan Varahi Yatra: 15 రోజులే టైమ్.. ఆ రోడ్డు వేయిస్తారా, లేదా?

by srinivas |   ( Updated:2023-06-25 13:41:59.0  )
Pawan Varahi Yatra: 15 రోజులే టైమ్.. ఆ రోడ్డు వేయిస్తారా, లేదా?
X

దిశ, వెబ్ డెస్క్: మల్కిపురంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. తాను జనసేను పెట్టింది కుల మధ్య కాదని, అందరి కోసమని ఆయన తెలిపారు. 150 మంది మొదలైన జనసేన 2019 ఎన్నికల్లో ఒక్క చోట మాత్రమే గెలిచిందని.. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయారని తెలిపారు. ఆ సమయంలో తాను చాలా బాధపడినట్లు తెలిపారు. కానీ రాజోలు విన్నింగ్ మాత్రం ఎడారిలో ఒయాసిస్సులా అనిపించిందన్నారు. బటన్ నొక్కితే ఎంతమందికి డబ్బులు పడుతున్నాయని ప్రశ్నించారు. అందరి దగ్గర డబ్బులు తీసుకుని వైసీపీ వాళ్లకే ఇస్తే ఎలా నిలదీశారు. వైసీపీ అక్రమాలు చదివి తన కళ్లకు కళ్ల జోడు వచ్చిందని సెటైర్లు వేశారు.

ఉభయగోదావరి జిల్లాల్లోనే తాను వదలనని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంటిపెట్టుకుని ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. 70 శాతం మంది ఉన్న ప్రజల అనైక్యత వల్ల 30 శాతం మంది మద్దతున్న నేతలు గెలుస్తున్నారని పవన్ పేర్కొన్నారు. విభజన సమయంలో మొదలైన తెలంగాణ నేతల దూషణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తాను ఈ భూమిపై ఉన్నంత వరకూ ప్రజల కోసమే కష్టపడి పని చేస్తానని చెప్పారు. హీరోలను పొగిడితే ఓట్లు పడతాయని మాట్లాడంలేదని తెలిపారు. 15 రోజులు సమయం ఇస్తున్నా.. ప్రభుత్వం బైపాస్ రోడ్డు వేయకపోతే తాను వేయిస్తానని వెల్లడించారు. గర్భిణీలు వెళ్తే ప్రాణాలు పోయేలా రోడ్లు ఉన్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Advertisement

Next Story