- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pithapuram:జనసైనికుల వీరంగం.. నడిరోడ్డు పై సామాన్య ప్రజలపై దాడి

దిశ,పిఠాపురం: జనసేనాని పవన్ కళ్యాణ్ 12వ ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తో రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్వయానా జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రులు చెబుతున్నా, జనసైనికులు లెక్కచేయకుండా ప్రవర్తించటం విమర్శలకు దారి తీసింది. శుక్రవారం చిత్రాడ వద్ద ట్రాఫిక్ ఏర్పడడంతో సామాన్య ప్రయాణికులు ప్రశ్నించారు.
దీంతో తమను ప్రశ్నించే వాడివాంటూ ఆగ్రహంతో పార్టీ జెండా కర్రతో ప్రయాణికుడిపై దాడి చేశారు. మరోవైపు కత్తిపూడి -కాకినాడ 216 జాతీయ రహదారిపై బైక్ తో జనసైనికులు ప్రమాదకర ఫీట్లు చేయడం, జనసేన కార్యకర్తల వీరంగంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పోలీసులకు, జనసైనికులు మధ్య ఉద్రిక్తత పరిస్థితి
జనసేన ఆవిర్భావ సభ నిమిత్తం పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసైనికులకు పోలీసులకు మధ్య చిత్రాడలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా తరలివచ్చిన నేతలు కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ సమయంలో పోలీసులకు, జనసైనికులకు మధ్య ఏర్పడిన రగడ ఉద్రిక్తతకు దారితీసింది.