పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేది ఆ రోజే..

by srinivas |   ( Updated:2024-04-19 09:37:41.0  )
పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేది ఆ రోజే..
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి భారీ జనసైనికులు తరలిరావాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది. కాగా ఏపీలో మే 23న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ నెల 23న నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read More..

సీఎం జగన్ కాకినాడ రూరల్ షెడ్యూల్ ఇదే...!


ఇప్పటికే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీయే కూటమి తరపు ఆయన సోదరుడు నాగబాబు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Advertisement

Next Story