- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Omicron BF-7: సంక్రాంతిని జరుపుకునేదెలా?
దిశ (ఉభయగోదావరి): ఉభయ గోదావరి జిల్లాల వాసులకు ఒమైక్రాన్ బిఎఫ్-7 భయం పట్టుకుంది. ప్రస్తుతం గోదావరి ప్రజలు క్రిస్టమస్ సంబరాలకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే సంక్రాంతి సంబరాలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగాగానే పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించనున్నారు. దీని కోసం తెలంగాణ నుంచి సైతం జనం ఇక్కడికి రానున్నారు. అదే విధంగా సాగర సంబరాలు పేరిట సముద్ర తీరానా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి తోడు గుండాట, పేకాట, రంగ వల్లులు, వంటివి పెద్ద స్థాయిలో నిర్వహించనున్నారు. వాటిని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి రానున్నారు రాజకీయ నాయకులు నుంచి సినీ తారలు కూడా ఇక్కడికి రానున్నారు. దీంతో జనసంద్రం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గోదావరి వాసులు సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలనే విషయమై మీమాంసలో పడ్డారు. కోవిడ్, ఒమైక్రాన్ కొత్త వైరస్ పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకత్వాలు జారీ చేసింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గోదావరి జనం ఆందోళనలో పడ్డారు.
భయం భయంగా క్రిస్టమస్ సంబరాలు
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్రిస్టమస్ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతీ చర్చి వద్ద జనం కిట కిట లాడుతున్నారు. అయితే పండగ ఆనందంగా జరుపుకోవాడానికి జనం భయ బ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఉల్లాసంగా జరుపుకోవాల్సిన పండగ భయం భయంగా జరుపుకొంటున్నారు. వాస్తవానికి గోదావరి జిల్లాల్లో క్రిస్టమస్ పండగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. చాలా చోట్ల రాజకీయ నాయకులు అధికంగా హాజరవుతారు. యానాం మేరీ మాత చర్చిలో క్రిస్టమస్ వేడుకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడికి కోనసీమ నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అయితే ఈ యేడాది వారిలో కోవిడ్ భయం పట్టుకొంది. కాకినాడలో అదిక సంఖ్యలో క్రిస్టమస్ జరుపుకుంటారు. ఇక్కడ కూడా కోవిడ్ భయంతో సాదా సీదాగా సంబరాలు జరుపుకుంటున్నారు.
కోడి పందాల నిర్వహకుల్లో భయం.. భయం..
సంక్రాంతి వస్తుందంటే చాలు.. కోడి పందాల నిర్వాహకుల్లో ఎక్కడా లేని ఆనందం నెలకొంటుంది. సంవత్సరం పొడవునా వారు పందెం కోళ్లను ఎంతో ఖర్చు చేసి పెంచి పోషిస్తారు. సంక్రాంతి బరిలోకి ఎప్పుడు దూకుదామా అని వారు ఎదురు చూస్తుంటారు. ఈ యేడాది కూడా అదే సరదాలో ఉన్న సందర్భంలో ఒమైక్రాన్ పిడుగు పడింది. దీంతో పందాల నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. గోదావరి జిల్లాల్లో అధికంగా భీమవరం, తణుకు, ఎదరుర్లంక, మురమళ్ల వంటి ప్రాంతాల్లో పందాలు జరుగుతుంటాయి. వీటిని వీక్షించడానికి తెలంగాణ నుంచి కూడా జనం తరలివస్తారు. అయితే జనం రద్దీ సమయంలో కోవిడ్ ఎటాక్ అవుతుందేమోననే భయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
సాగర సంబరాలు నిర్వహణ ఎలా?
సంక్రాంతి నాడు గోదావరి జిల్లాల్లో సాగర సంబరాలు, సంక్రాంతి సంబరాలు జరుపుకొంటూ ఉంటారు. కాకినాడ సముద్రం ఒడ్డున తెలుగు సాంప్రదాయం వట్టి పడే విధంగా సంబరాలు నిర్వహిస్తారు. అదే విధంగా గోదావరి తీరంలో కూడా సంబరాలు ఉంటాయి. రామచంద్రపురంలో మంత్రి వేణు గోపాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా సంబరాలు జరుపుకుంటారు. ప్రతీ చోటా రాజకీయ నాయకులు తమ పేరుకు తగ్గట్టుగా జనంలో పేరు ప్రతిష్టలు వచ్చే రీతిలో సంబరాలు నిర్వహించే ప్రణాళిక వేస్తారు. అధిక సంఖ్యలో జనం తరలివస్తారు. అయితే ఇక్కడ కూడా కోవిడ్ భయం వెంటాడుతుంది.
నెమర వేసుకొంటున్న పాత జ్జాపకాలు
ఉమ్మడి జిల్లాలో కోవిడ్ తొలి కేసు 2020 మార్చి 21న నమోదు అయితే తొలి మరణం మే 21 నమోదు అయింది. ఆ తర్వాత కేసుల తాడికి పెరిగి లక్షలకు చేరుకుంది. గత యేడాది కోనసీమ ప్రాంతమైన అయినవిల్లి మండలం టి సావరానికి చెందిన మహిళ కువైట్ నుంచి రావడంతో ఆమెకు ఒమైక్రాన్ సోకింది. రెండొవ సారి లాక్ డౌన్ సమయంలో అనేక మంది మృత్యు వాత పడ్డారు. ముఖ్యంగా యువత ఇట్టే మృత్యు వాత పడటంతో అనేక మంది ఆందోళనకు గురి అయ్యారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు సైతం ఇలా వ్యాధి బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డారు.
బూజు దులుపుతున్నారు...
మొన్నటి దాకా కోవిడ్ భయంతో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించిన జనం తాజాగా వాటి విషయం మర్చిపోయారు. యధావిధిగా పనులు చేసుకుంటున్నారు. అయితే మళ్లీ పాత రోజులకు వెళ్తున్నారు. అందరూ మాస్కులు సిద్ధం చేసుకుంటున్నారు. శానిటైజర్లు, సామాజిక దూరం మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు.షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడుతున్నారు.