పెళ్లి పేరుతో మహిళా బ్యాచ్ ట్రాప్.. కీలక ట్విస్ట్ ఏంటంటే..!

by srinivas |   ( Updated:2024-08-12 12:35:22.0  )
పెళ్లి పేరుతో మహిళా బ్యాచ్ ట్రాప్.. కీలక ట్విస్ట్ ఏంటంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి పేరుతో 11 మంది మహిళా బ్యాచ్ ఘరానా మోసానికి పాల్పడినట్లు కాకినాడకు చెందిన కృష్ణమోహన్ అనే బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు వయసు పెరిగిందని, పెళ్లి పేరుతో తనను మహిళలు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ కాకినాడ సొసైటీలో గౌరవమైన పొజిషన్‌లో ఉన్నాను. పెళ్లి కాని వారిని ఈ 11 మంది మహిళలు ట్రాప్ చేస్తున్నారు. పెళ్లి పేరుతో పట్టు చీరలు, బంగారం, నగదు కొనుగోలు చేస్తున్నారు. మేము లేనివాళ్లమని చెప్పి డబ్బులు సైతం తీసుకుంటున్నారు. అలా నలుగురైదుగురిని మోసం చేశారు. పరువుపోతుందని వాళ్లంతా ముందుకు రావడం లేదు. నేను మోసపోయినని తెలిసింది. నేను పెళ్లి చేసుకున్న యువతికి ఆల్ రెడీ పెళ్లిళ్లు అయ్యారు. పాప కూడా ఉన్నారు. యువతి స్వస్థలం రాజమండ్రి అని చెప్పారు. కానీ ఆమెది ఏలూరు అని తెలిసింది. పెళ్లి పేరుతో 11 మంది మహిళలు మోసం చేస్తున్నారు. రాజమండ్రిలో బట్టలు కొన్నారు. రూ. 35 వేలు తీసుకున్నారు. మరోసారి రూ. 2 లక్షలు తీసుకున్నారు. పెళ్లికి ముందు రూ. 2 లక్షల 40 వేలు బంగారం గొలుసు కూడా ఇచ్చా. నా డబ్బులతో ఫోన్ కూడా కొనుగోలు చేశారు నాకు ఎవరూ వెనుకాముందు లేరు. పెళ్లికి నా ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్లికి మధ్యవర్తులు ఉన్నారు. వాళ్లు కూడా డబ్బులు తీసుకున్నారు. రెండు, మూడు నెలలుగా సంబంధాలు చూపించారు. హడావుడిగా పెళ్లి సంబంధం కుదిరింది. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయి.’’ అని కృష్ణ మోహన్ పేర్కొన్నారు.


అయితే కృష్ణమోహన్ ఎవరో తనకు తెలియదని యువతి చెబుతున్నారు. ‘‘ఒక్కదానివే రావాలని ఆయన నన్ను బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నారు. నాకు పెళ్లి కాలేదు. పిల్లలు పుట్టలేదు. కావాలనే నాపై తప్పుడు ప్రచారం వేస్తున్నారు. నాకు డబ్బులు ఇవ్వలేదు. నేను అసలు ఏ బంగారం షాపుకు వెళ్లలేదు.’’ అని యువతి అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాల్సి ఉంది. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story