ఏపీలో దొంగనోట్ల కలకలం.. బ్యాంకు అధికారుల కీలక ప్రకటన

by srinivas |
ఏపీలో దొంగనోట్ల కలకలం.. బ్యాంకు అధికారుల కీలక ప్రకటన
X

దిశ,అమలాపురం: కోనసీమలో పలు ప్రాంతాల్లో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి. ఒరిజినల్ నోట్ల లాగే ఉండటంతో చాలా మంది మోసపోతున్నారు. బ్యాంకుకు వెళ్ళి నగదు జమ చేస్తుంటే దొంగ నోట్లు బయట పడుతున్నాయని బ్యాంకు అధికారులకు ఫిర్యాదులు రావటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో బ్యాంకు అధికారులు స్పందించారు. ఎక్కువగా 500, 200,100 రూపాయల దొంగ నోట్లు చలామణి అవుతున్నాయని తెలిపారు. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం తదితర గ్రామాల్లో 100,200,500 రూపాయల కట్టల్లో కనీసం రెండు, మూడు నోట్లు వస్తున్నాయని తెలిపారు. ఖాతాదారులు నోట్లు సరి చూసి తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తక్షణమే తమను సంప్రదించాలని బ్యాంక్ అధికారులు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed