Darmavaramలో సీన్ రివర్స్... వైసీపీ నుంచి టీడీపీలోకి 80 కుటుంబాలు

by srinivas |   ( Updated:2023-02-02 11:12:14.0  )
Darmavaramలో సీన్ రివర్స్... వైసీపీ నుంచి టీడీపీలోకి 80 కుటుంబాలు
X

దిశ, అన్నవరం: ప్రత్తిపాడు నియోజకవర్గ౦ ధర్మవరంలో 80 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల రాజా సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా వీరందరికీ వరపుల రాజా పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దాడులు అరాచకాలు ఎక్కువయ్యాయని, ప్రజలు విసిగి వేసారి పోయారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పేద ప్రజలకు అందాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయని, వీటిని పట్టించుకునే నాయకులు లేరని రాజా విమర్శించారు.

Advertisement

Next Story