- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Political News: వ్యూహం మార్చిన టీడీపీ.. కాకినాడ నుంచి బరిలో చినరాజప్ప?
- పెద్దాపురంలో ప్రత్యామ్నాయం
- సిటీలో కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలనే యోచన
- పెద్దాపురం అక్రమాలపై రాజప్ప కౌంటర్ ఇవ్వకపోవడంపై టీడీపీలో అంతర్మథనం
- రాజప్ప వర్సస్ ద్వారంపూడి ఉండాలంటున్న పార్టీ శ్రేణులు
దిశ, ( ఉభయ గోదావరి ప్రతినిధి): మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం శాసన సభ్యుడు నిమ్మకాయల చిన రాజప్ప కాకినాడ నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈసారి టీడీపీ అధిష్టానం రాజప్పను వ్యూహత్మకంగా కాకినాడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 60 వేలకు పైచిలుకు కాపు సామాజిక వర్గం ఉన్న కాకినాడ సిటీలో రాజప్పకు సీటు ఇస్తే కాపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనలో పార్టీ ఉంది. అంతేగాక స్థానిక శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నిమ్మకాయల చిన రాజప్పకు లోపాయి కారీ సాన్నిహిత్యం ఉన్నదనే ప్రచారం కూడా ఉంది. దీనికి కౌంటర్‌గా ఏకంగా ద్వారంపూడి మీదనే పోటీ చేయిస్తే అసలు విషయం తేలిపోతుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రాజప్పను ఈసారి కాకినాడ పంపించి తన సత్తా ఏంటో చూపించుకోమని పార్టీ ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కొండబాబుకు బదులుగా రాజప్ప
కాకినాడలో ప్రస్తుతం మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకూ మత్స్యకారులకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే కొండబాబు సీటు దక్కించుకొన్నారు. సిటీలో 40 వేలపై చిలుకు మత్స్యకారులున్నారు. అయితే కొండబాబు తన పదవీ కాలంలో చాలా విమర్శలకు గురి అయ్యారు. పార్టీ కూడా అయనను మందలించిన సందర్బాలు చాలా ఉన్నాయి. అంతేగాక మేయర్ ఎన్నికల్లో కొండబాబు తీరు పార్టీకి నచ్చలేదు. దీంతో ఈసారి కొండబాబును మారుద్దామనే ఆలోచనలో పార్టీ ఉంది. అయితే మత్స్యకారుల కోటాలో వేరే నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇద్దామని అనుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీలో అధికశాతం ఉన్న కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాజప్ప పేరు తెర మీదకు తెచ్చారు. ఇక్కడి అసెంబ్లీ స్థానం నుంచి రాజప్పను పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
రాజప్ప కౌంటర్లు ఎందుకు ఇవ్వడం లేదు....
రాజప్ప కొన్ని విషయాల్లో కౌంటర్లు ఇవ్వకపోవడం పట్ల పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజప్ప వైసీపీ వారితో వ్యాపారలావాదేవీలు పెట్టుకొంటున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్దాపురంలో కొండ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ సిటీ శాసన సభ్యుడు ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గట్ చేస్తూ వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి స్ట్ర్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. రాజప్పకు లేని అవసరం కొండబాబుకు ఎందుకు అని ప్రశ్నించారు. దీనిపై రాజప్ప స్పందింస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ రాజప్ప మౌనం వహించారు. దీంతో అందరూ ఊహించుకుంటున్నట్లే రాజప్ప, ద్వారంపూడికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అనే అనుమానం కలిగింది. దీంతో పార్టీ అంతర్గతంగా ఇబ్బంది పడుతుంది. ఇందులో భాగంగానే వీరిద్దరి మధ్య పోటీ పెడితే అసలు విషయం తేలిపోతుందనే స్కెచ్‌లో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.