బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్

by Sathputhe Rajesh |
బొలెరోను ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరోని దురంతో ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి రైలు వైజాగ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం కారణంగా 6 గంటలకు పైగా రైలు నిలిచిపోయింది. ఆ తర్వాత విశాఖకు బయల్దేరి వెళ్లింది. రైలు వస్తున్న సమయంలో సిబ్బంది భీమడోలు జంక్షన్ వద్ద రైల్వే గేటు వేశారు. అయినా బొలెరో వాహనంతో కొంత మంది రైల్వేగేటు ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దురంతో ఎక్స్ ప్రెస్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. రైలు వస్తుండటాన్ని గమనించిన బొలెరోలోని వ్యక్తులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బొలెరోలో వచ్చిన వారు దొంగలా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story