AP News:పుట్టపర్తి చిత్రావతి చెక్ డ్యామ్‌ని పరిశీలించిన డీఎస్పీ

by Jakkula Mamatha |
AP News:పుట్టపర్తి చిత్రావతి చెక్ డ్యామ్‌ని పరిశీలించిన డీఎస్పీ
X

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి చిత్రావతి లోకి నీరు వస్తుండడంతో డ్యాం పొంగే అవకాశం ఉందని పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో చిత్రావతి నదికి ఆనుకుని ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనైనా.. నీటి ఉధృతి పెరిగిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానిక పోలీసులకు డీఎస్పీ సూచించారు. లోతట్టు ప్రాంతమైన సాయి నగర్ కాలనీ వాసులతో పాటు నదికి ఇరువైపులా ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు. అదేవిధంగా నది ప్రాంతంలో ఉన్న పొలాల్లోకి రైతులు వెళ్లొద్దని నీటి ఉధృతం బట్టి వెళ్లాలని రైతులకు తెలియజేశారు.

Advertisement

Next Story