తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సు పై నిద్రించిన మందుబాబు.. స్థానికులు గుర్తించడంతో!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-26 10:46:07.0  )
తాగుబోతు హల్‌చల్.. పీకలదాకా తాగి బస్సు పై నిద్రించిన మందుబాబు.. స్థానికులు గుర్తించడంతో!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలోని కడప జిల్లా(Kadapa District)లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాజాగా జిల్లాలో ఓ తాగుబోతు హల్‌చల్ సృష్టించాడు. వేంపల్లిలో పీకలదాకా తాగినా ఓ తాగుబోతు మద్యం మత్తులో రాయచోటి డిపో(Rayachoti Depot)కు చెందిన బస్సు పై నిద్రించాడు. అయితే అది ‘రాయచోటి-వేంపల్లి’ వెళ్లే బస్సు. వివరాల్లోకి వెళితే.. బస్ కండక్టర్(Bus conductor) బస్సును వేంపల్లి నుంచి రాయచోటికి తీసుకు వెళ్లే క్రమంలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లికి బస్సు చేరుకుంది. అయితే బస్సు డ్రైవర్(Bus driver) ఆ మందుబాబును చూడకుండా బస్సును స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో బస్సు టాప్ పైన నిద్రస్తున్న మందుబాబును స్థానిక ప్రజలు గుర్తించారు. వెంటనే కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో తాగుబోతు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సును ఆపిన డ్రైవర్ అతన్ని లేపాడు. ఆ డ్రైవర్ తాగుబోతును నెమ్మదిగా కిందికి దించి అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానిక ప్రజలు నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed