- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగపూట వదల్లేదు: పురంధేశ్వరి!ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిల మధ్య వార్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ట్విటర్ వేదికగా రాజకీయ పోరు నడుస్తోంది. విజయసాయిరెడ్డి వర్సెస్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నట్లు ఏపీ రాజకీయం మారిపోయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీపావళి రోజైనా ఈ విమర్శలకు తావివ్వరని అంతా భావించారు. కానీ దీపావళి పండుగ రోజు కూడా దగ్గుబాటి పురంధేశ్వరిని వదల్లేదు. ఏకంగా పురంధేశ్వరి మరిది చంద్రబాబు నాయుడు కేసుకు లింక్ పెడుతూ పండుగపూట తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ స్కాంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న దగ్గుబాటి పురంధేశ్వరి వాటిని సీఐడీ అధికారులకు పురంధేశ్వరి అందజేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. ‘చంద్రబాబు ఏ3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలి’ అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
ఏ3గా చంద్రబాబు
ఇకపోతే ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు గత నెలలో బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి వివరాలను సైతం జతపరిచారు. అంతేకాదు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. ఈ కల్తీ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు. ప్రతి ఏటా మద్యం ద్వారా రూ.25 వేల కోట్ల అవినీతి జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు. ప్రతీ ఏడాది మద్యం విక్రయాల ద్వారా రూ.57వేల కోట్ల ఆదాయం వస్తుండగా ఏపీ ప్రభుత్వం కేవలం రూ.32వేల కోట్లు మాత్రమే ఆదాయంగా చూపిస్తోందని ఆరోపించారు. ఇదే తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 30న మద్యం తయారీ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన అనూయల కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని ఏపీ బేవరేజేస్ కార్పోరేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ కేసులో చంద్రబాబు పేరును ఏ3గా చేర్చిన సంగతి తెలిసిందే.