మీకు జనసేన టికెట్ కావాలా?..అయితే ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే

by Seetharam |   ( Updated:2023-09-24 12:44:05.0  )
nagababu
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన టికెట్లు ఆశించే వారికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కండీషన్స్ అప్లై అంటున్నారు.డబ్బు ఉంటే టికెట్ ఇస్తారనుకుంటే పొరపాటని అంటున్నారు. జనసేన పార్టీకి సిద్దాంతం అంటూ ఒకటి ఉందని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ టికెట్ కావాలంటే ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలనే తపన ఉండాలని సూచించారు. టికెట్లు కేటాయింపు అంశం పూర్తిగా అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటారని వెల్లడించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నాగబాబు టికెట్ ఆశించే వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు జనసేనకు అవసరం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. డబ్బున్నవాళ్లు కాదని ప్రజాసేవకులు తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేవారు. ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్నవారికే టిక్కెట్ ఇస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని నాగబాబు అన్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పైనా నాగబాబు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అన్నారు. అక్రమంగా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై జనసైనికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇకపొత్తులపైనా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తును తమ పార్టీ నేతలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే టికెట్లు కేటాయింపు, ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది పవన్ కల్యాణ్ ప్రకటించారని అన్నారు. టికెట్లు కేటాయింపు సమయంలో బీజేపీతో పొత్తుపై కూడా ఓ స్పష్టత వస్తుందని నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు.

Read More Andhra Pradesh News updates

Advertisement

Next Story