Ballot papers: బ్యాలెట్ పేపర్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా..?

by Disha Web Desk 3 |
Ballot papers: బ్యాలెట్ పేపర్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా..?
X

దిశ వెబ్ డెస్క్: సార్వత్రిక ఎన్నికలతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన పత్రాలను, బ్యాలెట్ పేపర్లను ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ పేపర్లు ఎక్కడ తయారవుతాయో ఆలోచన మనలో చాలామందికి వచ్చే ఉంటుంది.

ఆ బ్యాలెట్ పేపర్లు ఎక్కడ తయారవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ పేపర్లు అలానే పత్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ప్రెస్ తయారు చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇక్కడే కావలసిన పత్రాలను బ్యాలెట్ పేపర్లను తయారుచేసేవారు.

ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అలానే నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు కూడా గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఫైనల్ అయిన అభ్యర్థుల పేర్లు, గుర్తులకు సంబంధించిన జాబితాను కర్నూల్‌లో ఉన్న ఆంధ్ర గవర్నమెంట్ ప్రెస్‌కు చేరుస్తారు. అక్కడ ఆ జాబితా ప్రకారం ప్రింటింగ్ ప్రతి పూర్తి చేసి, బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేస్తారు.

Read More..

పవన్ గెలిస్తే ప్రపంచ స్థాయికి పిఠాపురం..ప్రచారంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్!

Next Story

Most Viewed