- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాళ్ళను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చెయ్యొద్దు.. సీఈసీ
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని పలు పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేతల ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విధుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని.. అలా ఎవరైనా బాధ్యతారాహిత్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వహించే అధికారులకు ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి సమానమేనని.. ఏ ఒక పార్టీకో.. అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరించడం సబబు కాదని.. అది చట్టవిరుద్ధం అని.. అలా ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలకూ,అలానే అభ్యర్థుల అందరికి సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరాయని.. అందిన ఫిర్యాదుల్లో కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించామని.. మరికొన్నింటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అత్యంత సున్నితంగా ఉన్న ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పక్షాల నేతలు అభ్యంతర కరమైన పదజాలం వినియోగించకూదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రలోభభరితమైన, పారదర్శకమైన, స్వేచ్చాయుత ఎన్నకల నిర్వహణే తమ ధ్యేయమని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ పర్యటనకు వచ్చినట్లు పేర్కొన్నారు.