- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ నాశనం: DMR శేఖర్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: జనసేనపై ఆ పార్టీ మాజీ నేత డీఎంఆర్ శేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీలో కనీస గౌరవం, గుర్తింపు దక్కలేదని.. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ వల్ల జనసేన పార్టీ నాశనం అయ్యిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా నాదెండ్ల మనోహర్‌ను ప్రోత్సాహించడం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు తగదని సూచించారు. అమలాపురం పార్లమెంట్ సీటుపై గతంలో మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా త్యాగాలు చేయాలి కానీ.. ఇంకో పార్టీ కోసం త్యాగం చేయకూడదని చురకలంటించారు.
ఇదే వైఖరి కొనసాగిస్తే జనసేన పార్టీ మనుగడ కష్టమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాగా, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ అయిన డీఎంఆర్ శేఖర్ అమలాపురం ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఆయనకు పవన్ కల్యాణ్ టికెట్ నిరాకరించారు. పొత్తులో భాగంగా అమలాపురం ఎంపీ టికెట్ బీజేపీకి.. అసెంబ్లీ టికెట్ టీడీపీకి దక్కింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన శేఖర్ జనసేన పార్టీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు.