గుర్లలో అదుపులోకొచ్చిన డయేరియా.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి

by srinivas |   ( Updated:2024-10-20 15:26:57.0  )
గుర్లలో అదుపులోకొచ్చిన డయేరియా.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలిన విషయం తెలిసిందే. అయితే వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో 100 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని తాగు నీటిని పరిశీలించారు. ప్రజలందరికి వైద్యం అందించారు. దీంతో డయేరియా అదుపులోకి వచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ క్లారిటీ వచ్చింది. డయేరియా కేసుల నమోదుపై వివరాలను అధికారులు వెల్లడించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు డయేరియా కేసులు పెరిగాయని తెలిపారు. నాలుగు రోజులుగా కేసుల నమోదులో భారీ తగ్గుదల నమోదు అయినట్లు పేర్కొన్నారు. శనివారం ఒక్క డయేరియా కేసు మాత్రమే నమోదు అయిందని స్పష్టం చేశారు. డయేరియా వల్ల మరణించింది ఒక్కరే అని నివేదికలో వెల్లడైందని తెలిపారు. తాగునీటి కాలుష్యమే వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed