- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొటియా గ్రామాలు ఆ రాష్ట్రానివే: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ, ఒడిషా రాష్ట్రాల మధ్య వివాదానికి తెర లేపాయి. శనివారం కొటియా గ్రామాల్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొటియా గ్రామాలు ఒడిషావేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా అక్కడకు వచ్చిన కొటియా సీఐ రోహిణి పాత్రో ధర్మేంధ్ర ప్రధాన్‌ను కలిశారు. దీంతో ఆయన ఏపీ పోలీసులకు ఇక్కడ ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు సైతం గో బ్యాక్ ఏపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోటా పోటీగా ఏపీ, ఒడిషా ప్రజలు నినాదాలు చేసుకున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు. దాదాపు 15 వేల మంది నివసించే ఈ 21 గ్రామాల గురించి ఏపీ, ఒడిషా రాష్ట్రాల మధ్య గత కొన్నేండ్లుగా వివాదం సాగుతోంది. కొటియా గ్రామాలు తమవంటే తమవంటూ ఇరు రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రజలకు రెండు రాష్ట్రాలు ఓటు హక్కును కల్పించడంతో పాటు రెండు రాష్ట్రాల్లో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు పోటీ పడి మరీ అందించడం విశేషం. ఇక, ఈ 21 కొటియా గ్రామాల్లో 3,902 మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా, ఇక్కడ పర్యటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొటియా గ్రామాలు ఒడిషావేనంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి అజ్యం పోశాయి.